ఆత్మీయ ఫోటోగ్రఫీ సోదరులకు నమస్కారం,
స్వరక్ష పరివార్ పథకం ఇలాంటి ఒక సమస్యతో ప్రారంభించాల్సి వస్తుంది అని ఊహించలేదు. ఫోటో ట్రేడ్ ఎక్స్‌పోస్ లో హెల్త్ క్యాంపులు నిర్వహించి ఎంతో మంది ఫోటోగ్రాఫర్‌లకు నిస్వార్థంగా సహాయం చేసిన శ్రీధర్ (ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు)ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వినడం చాలా బాధాకరం. జీబీయస్ వైరుస్ సోకడం వల్ల అతని రెండు చేతుల్లో బలం కోల్పోయాడు. చేతులే ముఖ్య పాత్ర పోషించే మన వృత్తిలో రెండు చేతులు నిర్వీర్యం కావడం చాలా బాధాకరం. నిపుణులచే తగిన వైద్యం జరిగినప్పటికీ ఆర్డర్స్ వెళ్ళలేక వచ్చే ఆరునెలల వరకు అతడు జీవనోపాధి కోల్పోయే దుస్థితిలో ఉన్నాడు.
ఈ క్లిష్టమైన సమయంలో శ్రీధర్‌కి సహాయం చేయడానికి చేతులు కలుపుదాం రండి. ప్రతి చిన్న సహకారం అతని ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మరియు అతనికి ఆత్మస్థైర్యం నింపడానికి దోహద పదుతుందని ఆశిస్తున్నాం.
తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని మరియు మళ్ళీ పని చేసుకునే పరిస్థితికి రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మనవంతు సహకారం అందిస్థాం.
ఇట్లు,
స్వరక్ష పరివార్ కమిటీ,
తెలంగాణ ఫోటో & విడియో గ్రాఫర్స్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ (TPVPA)